: బీజేపీని హైజాక్ చేసిన మోడీ: నితీశ్
బీజేపీ నేత నరేంద్రమోడీపై బీహార్ సీఎం నితీశ్ తన మాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. బీజేపీని మోడీ హైజాక్ చేశారని తాజాగా వ్యాఖ్యానించారు. గతంలో తన సహచర పార్టీ అయిన బీజేపీని మోడీ హైజాక్ చేశారని... మోడీ కోసం పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ అరగంటలోనే బీజేపీ నినాదాన్ని మార్చివేశారని పేర్కొన్నారు. రాజ్ నాథ్ సింగ్ ట్విట్లర్లో పేర్కొన్న టైమ్ ఫర్ చేంజ్.. టైమ్ ఫర్ బీజేపీ నినాదాన్ని నితీశ్ ఉదహరించారు.