: మనిషికి నీరు ఎంత అవసరమో... దేశానికి మోడీ అంత అవసరం: శివాజీ
గత 60 ఏళ్లలో మనం సాధించింది ఏమైనా ఉందంటే... ‘‘అవినీతి, నిరక్షరాస్యత, నిరుద్యోగం, మంచి నీరు కూడా లేకపోవడం.. ఇంకా ఇలాంటివి ఎన్నో’’ అని నటుడు శివాజీ చెప్పారు. తాను ఎలాంటి పదవులు ఆశించి భారతీయ జనతాపార్టీలో చేరలేదని ఆయన అన్నారు. తాను కొన్ని పనులు చేయాలనుకుంటున్నానని... వాటికోసం ఒంటరిగా ఎంత ప్రయత్నించినా సరైన ఫలితాన్ని సాధించలేకపోయానని తెలిపారు. తన లక్ష్యసాధన కోసం మంచి వేదిక అవసరమని... అది బీజేపీనే అని ఆయన తెలిపారు. బీజేపీలో అయితే కుటుంబపాలన, కులం, మతం ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. మనిషికి మంచినీళ్లు ఎంత అవసరమో.. దేశానికి మోడీ అంత అవసరమని ఆయన అన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు ఆదరించారని ఆయన తెలిపారు. ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.