: వారసులకే మా ఓటు అంటున్న భారతీయులు
రాహుల్ గాంధీ... రాజకీయాల్లో గాంధీల వారసుడు. నరేంద్ర మోడీ... ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా మెట్టు మెట్టు ఎక్కుతూ వచ్చిన నేత. మరి, భారతీయుల్లో సగం మంది చాయిస్ ఎవరో తెలుసా. రాహులే! అమెరికాకు చెందిన కార్నెగీ ఎండోమెంట్ ఇంటర్నేషనల్ పీస్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. దేశంలో 46 శాతం మంది ఓటర్లు తాము వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలకే ఓటు వేస్తామని చెప్పడం విశేషం. ఇది తమకు షాకింగ్ అని కార్నెగీ ఎండోమెంట్ కు చెందిన మిలాన్ వైష్ణవ్ అన్నారు. వారసత్వంగా వచ్చిన వారైతే ఎక్కువగా రాణిస్తారని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. 65వేల మంది అభిప్రాయాల ఆధారంగా ఈ ఫలితాలను అంచనా వేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికైన వారిలో 29 శాతం మంది నేతల వారసులేనని వైష్ణవ్ తెలిపారు.