: బీజేపీలో చేరిన సినీ హీరో శివాజీ
సినీ హీరో శివాజీ బీజేపీలో చేరారు. కాసేపటి క్రితం బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, శివాజీ మంచి సామాజిక స్పృహ కలిగిన నటుడని కొనియాడారు. ఇటీవల కాలంలో ఆయన తిరుమలలో జరుగుతున్న అవినీతిపైన, ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తున్న ఘోరాలపైన పోరాటం చేశారని గుర్తుచేశారు. మంచి కుటుంబ కథా చిత్రాలతో శివాజీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండానే శివాజీ బీజేపీలోకి చేరుతున్నారని... ఆయన్ను బీజేపీలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు.