: కోమాలో ప్రముఖ క్రికెటర్ జెస్సీ రైడర్


న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. గతరాత్రి న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చిలోని బార్ లో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ సమయంలో తీవ్రంగా గాయాలయిన అతన్ని క్రైస్ట్ చర్చి ఆసుపత్రికి తరలించారు. 

దాడి సమయంలో రైడర్ తలకు బాగా గాయాలయ్యాయని తెలుస్తోంది. మరోవైపు ఊపిరితిత్తులకు తగిలిన దెబ్బల కారణంగా అంతర్గత రక్తస్రావం అవుతోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడని, పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.

కాగా, ఏప్రిల్ 3న మొదలవనున్న ఐపీఎల్ మ్యాచ్ లలో ఢిల్లీడేర్ డెవిల్స్ తరపున రైడర్ ఆడాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News