: ఐపీఎల్ ఫిక్సింగ్ పై సుప్రీంకు బీసీసీఐ ప్రతిపాదనలు
సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీంకోర్టుకు బీసీసీఐ ప్రతిపాదనలు సమర్పించింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ ఆధ్వర్యంలోని కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఫిక్సింగ్ వ్యవహారంపై మరింత విచారణ జరగాల్సి ఉందని బీసీసీఐ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్ ను పదవి నుంచి తప్పుకోవాలంటూ మొన్న సుప్రీం సూచించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేడు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయనుంది. దాంతో. ముందుగానే బీసీసీఐ తమ తరపున ప్రతిపాదనలు ఇచ్చింది.