: ప్రకాశం జిల్లాలో సామూహిక అత్యాచారం
మరో సామూహిక అత్యాచార ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. అద్దంకి మండలం సింగరాయకొండలో 18 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. సింగరాయకొండలోని తిరునాళ్లకు బుధవారం నాడు తన స్నేహితుడితో కలిసి వెళ్లిన యువతి మీద కాంమాంధులు తెగబడ్డారు. ఆమెను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు నిందితులనూ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.