: నేడు విజయవాడలో టీడీపీ మహిళా గర్జన సభ
తెలుగుదేశం పార్టీ మహిళా గర్జన సభ ఈ రోజు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం డీవీ మానోర్ హోటల్ నుంచి పార్టీ అధినేత చంద్రబాబు ర్యాలీగా బయలుదేరి సభావేదికవద్దకు చేరుకుని మహిళా గర్జన సభలో ప్రసంగిస్తారు. అనంతరం శేషసాయి కల్యాణ మండపంలో జరిగే జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.