: హైకోర్టుకు హాజరైన మంత్రి పొన్నాల
2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక కావడంపై టీఆర్ఎస్ అభ్యర్ధి కె. ప్రతాప రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు ఈ ఉదయం పొన్నాల కోర్టుకు హాజరయ్యారు.
వరంగల్ జిల్లా జనగాం శాసనసభ ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్యకు అనుకూలంగా ఫలితాలు వెల్లడించారనీ, దీనిపై రీకౌంటింగ్ చేపట్టాలనీ కోరుతూ ప్రతాపరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాగా, అప్పటి ఎన్నికల్లో 236 ఓట్లతో పొన్నాల గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.