: ఉద్యోగాలు కావాలా? వద్దా?: బాబు
శ్రీకాకుళం ప్రజాగర్జన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఉద్యోగాలు కావాలా? వద్దా? అని సభికులను ప్రశ్నించారు. జాబ్ రావాలంటే బాబు రావాలంటున్నారని పేర్కొన్నారు. చంద్రన్నే రావాలని తమ్ముళ్ళు కోరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో భద్రత కొరవడిందని మండిపడ్డారు. ఆడపిల్లలను కాపాడుకుంటామని, వారికి సెల్ ఫోన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.