: పార్టీ ఆదేశిస్తే లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్ధం: కిషన్ రెడ్డి


భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్ధమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని, పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకైనా, పార్లమెంటుకైనా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. పార్టీలతో పొత్తుల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అయితే ఆ విషయం అధిష్ఠానం చూసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీలతో పొత్తు కుదరకపోతే అన్ని స్థానాలకు పోటీచేసేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News