: ఢిల్లీని చూసి భయపడాల్సిన పనిలేదు: బాబు
ఇకపై ఢిల్లీని చూసి భయపడాల్సిన పనిలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సీమాంధ్రలో చాలా వనరులున్నాయని, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. హైదరాబాదు పురోగతి తమ చలవే అని బాబు పునరుద్ఘాటించారు.