: కాంగ్రెస్ ఉండడానికి వీల్లేదు: చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాకు ఓ అవినీతి అనకొండను తయారుచేసిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి ధర్మాన కూడా ఓ అనకొండ అని విమర్శించారు. ఆయన కన్నెధార కొండను దోచుకున్నాడని వివరించారు. జిల్లాలో అవినీతికి వ్యతిరేకంగా ఎర్రన్నాయుడు తీవ్ర పోరాటం చేశాడని బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ తన హయాంలో పన్నులతో సామాన్యుడి నడ్డి విరించిందని దుయ్యబట్టారు. పదేళ్ళలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని బాబు మండిపడ్డారు.