: సీమాంధ్రులను మెప్పించాలని చెప్పాను, వినలేదు: బాబు
తెలుగుజాతికి జరిగిన అన్యాయంపై అందరూ ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకే నిర్ణయించుకున్న కాంగ్రెస్ తన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చేట్టయితే మొదట సీమాంధ్రులను మెప్పించాలని కోరానని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ఏకపక్షంగా ముందుకెళ్ళిందని చెప్పారు.