: దశాబ్దాల చరిత్రగల గోడను కూల్చేశారు
ఓ అపార్ట్ మెంట్ నిర్మాణానికి అడ్డుగా ఉందని చారిత్రక బెర్లిన్ గోడ అవశేష భాగాన్ని కూల్చివేస్తున్నందుకు బెర్లిన్ ప్రజలు వ్యతిరేకత తెలుపుతున్నారు. ఈ మహా కుడ్యాన్ని కూల్చివేయనిచ్చేదిలేదని నిరసనలు సాగిస్తున్నారు. అయితే, ఇవేవి లక్ష్యపెట్టని భవంతి నిర్మాణదారులు పోలీసుల రక్షణ మాటున కూల్చివేత పనులు సాగించారు. అనంతరం అక్కడ అపార్టుమెంటు నిర్మాణ పనులను కూడా మొదలుపెట్టారు. అయితే, స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వం చారిత్రక సంపదను ఇలా చేస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన వైషమ్యాలు పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీల మధ్య బెర్లిన్ కుడ్యానికి పునాది వేశాయి. తూర్పు జర్మనీలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం 1961లో ఈ చారిత్రాత్మక గోడను నిర్మించింది. పశ్చిమ జర్మనీ నుంచి వలసలను అరికట్టడమే ఈ భారీ కట్టడం వెనుక ప్రధాన కారణం. ఆ సమయంలో పశ్చిమ జర్మనీలో ప్రజాస్వామ్యం రాజ్యమేలుతోంది.
సైద్ధాంతిక విభేదాలకు, ప్రపంచ పరిణామాలు తోడవడంతో రూపుదిద్దుకున్న ఈ 96 మైళ్ళ గోడ జర్మన్లను నిలువునా విడదీసింది. బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు ఇలా అందరినీ 30 ఏళ్ళ పాటు విభజించిన ఈ మహా కుడ్యం 1989లో రష్యా జోక్యంతో కుప్పకూలింది. జర్మన్ల ఏకీకరణ ఘట్టానికి సాక్ష్యంగా కొంత మేర ఈ గోడ అవశేషాలు మిగిలే ఉన్నాయి.
వాటిలో తూర్పు వైపు భాగంలో 120 మంది చిత్రకారులు తమ అద్భుతమైన పెయింటింగ్ నైపుణ్యంతో పలు చిత్రాలు ఈ కుడ్యంపై గీశారట. ఇప్పుడది జర్మనీలో ప్రముఖ పర్యాటక స్థలంలా బాసిల్లుతోంది. ఇప్పుడా గోడను ఓ అపార్ట్ మెంట్ కోసం కూల్చివేయడాన్ని బెర్లిన్ వాసులు సహించలేకపోతున్నారు. భవంతి నిర్మాణదారులు లాభాల కోసం చరిత్రను మట్టిలో కలిపేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Loading...
More Telugu News
- Loading...