: ఎర్రన్నాయుడు లేని లోటు తీర్చే బాధ్యత నాదే: చంద్రబాబు
శ్రీకాకుళంలో టీడీపీ ప్రజాగర్జన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎర్రన్నాయుడు లేని లోటు తీర్చే బాధ్యత తనదేనని చెప్పారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార వంటి నదులున్నా సాగునీరు కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం కాంగ్రెస్ దొంగలేనని ఆరోపించారు. ఈ జిల్లాలో ఎందరో మహానుభావులు పుట్టారని బాబు తెలిపారు.
తెలుగునుడికారం పుట్టింది ఈ గడ్డ పైనే అని, మాకొద్దీ తెల్లదొరతనం అని నినదించిన గరిమెళ్ళ సత్యనారాయణ ఇక్కడి వాడే అని గుర్తు చేశారు. ఇప్పుడు మాకొద్దీ సోనియా పాలన అని ప్రతి ఒక్కరూ ఎలుగెత్తాలని బాబు పిలుపునిచ్చారు. ఒక్కొక్క తమ్ముడు ఒక్కొక్క సైనికుడు కావాలని ఆకాంక్షించారు.