: బీజేపీలో చేరిన సినీ నటుడు సురేష్
సినీ నటుడు సురేష్ (సీనియర్ హీరో) ఈ రోజు బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ... దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, మోడీ మాత్రమే దేశాన్ని రక్షించగలరని చెప్పారు. నరేంద్ర మోడీని టీ అమ్ముకునే వాడిగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. మోడీ కేవలం టీ మాత్రమే అమ్ముకున్నారని... కాంగ్రెస్ నేతలు దేశాన్నే అమ్మేశారని విమర్శించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సురేష్ బీజేపీలో చేరడం సంతోషదాయకమని తెలిపారు.