: ప్రెస్ మీట్ లో భోరున విలపించిన సంజయ్ దత్
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల శిక్షకు గురైన ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భోరున విలపించారు. న్యాయస్థానం ఇచ్చిన గడువు కంటే ముందుగానే లొంగిపోతానని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నానన్నారు. తీర్పుకు కట్టుబడి ఉంటానని, క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకోనని కూడా సంజయ్ దత్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆయన ముంబయ్ లో కొద్దిసేపటిక్రితం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను క్షమాభిక్ష కోరటం లేదు కావున ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తనను మానసిక క్షోభకు గురిచేయొద్దని ఆయన మీడియాను వేడుకున్నారు. తనకు ఎంతో తోడ్పాటు, అండ, మద్దతు నిచ్చిన భారతదేశానికి, ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. నేను.. నా దేశాన్ని, నా ప్రజలను ఎంతో ప్రేమిస్తున్నానని తీవ్ర భావోద్వేగానికి గురవుతూ వెల్లడించారు. కంటతడిపెట్టిన సంజయ్ ను ప్రక్కనే ఉన్న సోదరి.. కాంగ్రెస్ ఎంపీ ప్రియా దత్ సముదాయించారు.
- Loading...
More Telugu News
- Loading...