: మెట్రో రైలును అండర్ గ్రౌండ్ లో పంపిస్తాం: కేసీఆర్
తెలంగాణను పుణ్యానికి ఇచ్చినట్టు కాంగ్రెస్ మాట్లాడుతోందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆంధ్రలో నిర్మించిన అక్రమ ప్రాజెక్టులకు కారకుడు టీపీసీసీ చీఫ్ పొన్నాల కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని తెలిపారు. టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణలో మరో 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మెట్రో రైలు నిర్మాణంతో హైదరాబాదులో అసెంబ్లీ, మొజంజాహీ మార్కెట్ లాంటి వారసత్వ కట్టడాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతాల్లో మెట్రో రైలును అండర్ గ్రౌండ్ లో పంపిస్తామని చెప్పారు. ఈ రోజు జగిత్యాలకు చెందిన వారు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ ను జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు.