: బీజేపీ ప్రచారం గాలిబుడగలాంటిది, తుస్సుమనడం ఖాయం: రాహుల్
ఎన్నికల్లో యూపీఏ విజయంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో, బీజేపీ ప్రచారం గాలిబుడగలాంటిదని, అది తుస్సుమనడం ఖాయమని ఎద్దేవా చేశారు. 2004లో భారత్ వెలిగిపోతోందంటూ ప్రచారం చేసి ఎలా భంగపడ్డారో తెలిసిందేనన్నారు. మోడీ భావజాలంతో దేశానికి చేటు తప్పదని రాహుల్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఢిల్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.