: మా సహకారం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు: మమత


ఎన్నికల అనంతరం తాము కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తమ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెప్పారు. హస్తినలో ఈసారి తమదే హవా అని పేర్కొన్నారు. డార్జిలింగ్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న భైచుంగ్ భుటియా తరపున మమత నేడు ప్రచారం నిర్వహించారు. కాగా, డార్జిలింగ్ ఎప్పటికీ పశ్చిమబెంగాల్లో అంతర్భాగంగానే ఉంటుందని ఆమె ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News