: వీడియోగేమ్ ఆడుతూ బుక్కపోయిన ఎస్పీ


ఉత్తరప్రదేశ్ లోని ఓ సీనియర్ పోలీసు అధికారి విధి నిర్వహణలో వీడియోగేములు ఆడుతూ చిక్కుల్లో పడ్డాడు. ఎన్నికల నేపథ్యంలో ఆగ్రా జోన్ ఐజీ అశుతోష్ పాండే పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓవైపు ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సీరియస్ గా మాట్లాడుతుండగా, క్రైమ్ విభాగం ఎస్పీ షకీల్ ఉజ్జమాన్ అంతే సీరియస్ గా స్మార్ట్ ఫోన్ లో వీడియోగేములు ఆడుతూ కనిపించారు. ఇది కాస్తా మీడియా కంటబడడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. పలు సోషల్ మీడియా వెబ్ సైట్లలోనూ, చానళ్ళలో ఈ క్లిప్పింగ్స్ ప్రసారమైన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఐజీ ఆదేశించారు.

  • Loading...

More Telugu News