: జనసేన కార్యకర్తల బైక్ ర్యాలీ
జనసేన పార్టీ విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన సంఘీభావ ర్యాలీ విజయవంతమయ్యింది. సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ యువభేరి పేరుతో తొలి బహిరంగ సభను విశాఖపట్నంలో గురువారం నిర్వహించనుంది. జనసేన సభకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ అభిమానులు విశాఖ నగరంలో ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టారు. మద్దిలపాలెం నుంచి పి.ఎం.పాలెం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. రేపు జరిగే పవన్ కల్యాణ్ సభను విజయవంతం చేయాలని జనసేన కార్యకర్తలు కోరారు.