: చంద్రబాబు కూడా నాలాంటివాడే: బాబూమోహన్
టీడీపీకి గుడ్ బై చెప్పిన హాస్యనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ నేడు చంద్రబాబు నాయుడిపై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూడా తనలాగే టీడీపీలోకి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది బాబు కాదని, ఎన్టీఆర్ అని చెప్పారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మూడు రోజుల తర్వాత కూడా బాబు నుంచి స్పందన కనిపించలేదని బాబూమోహన్ మండిపడ్డారు. మెదక్ జిల్లా జోగిపేటలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ఆరంభించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన టీడీపీలో చేరారు.