: అన్నీ ఊహాగానాలే: ఎంపీ వివేక్
పెద్దపల్లి ఎంపీ, టీఆర్ఎస్ నేత వివేక్ ఈ రోజు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు. తాను టీఆర్ఎస్ ను వీడి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నానంటూ గత కొన్ని రోజులుగా వెల్లువెత్తుతున్న వార్తలపై ఆయన కేసీఆర్ కు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వ్యవహారశైలిపై కూడా వివేక్ ఆగ్రహంగా ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఈ వార్తలన్నీ కేవలం ఊహాగానాలే అని... రానున్న ఎన్నికల్లో తాను టీఆర్ఎస్ తరపునే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వివేక్, కేకే, మందా జగన్నాథ్ లు గత జూన్ 2న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.