: మంత్రుల ఇళ్లకు కరెంట్ కట్
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో గల మాజీ మంత్రుల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో భారీ ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. దీంతో తాజా మాజీల ఇళ్లకు విద్యుత్ శాఖాధికారులు కరెంట్ కట్ చేశారు.