: ట్వీట్లను మింగేస్తున్న ట్విట్టర్ బగ్!


ట్విట్టర్ లో తాము పోస్ట్ చేసిన ట్వీట్లు కనిపించడంలేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆస్కార్ అవార్డుల సందర్భంగా అమెరికన్ హాస్య నటి ఎలెన్ డీ జనర్స్ సెల్ఫీ ట్వీట్ కూడా అదృశ్యమైందట. తాము పోస్ట్ చేసిన ట్వీట్ల స్థానంలో.... 'సారీ, దట్ పేజ్ డజ్ నాట్ ఎగ్జిస్ట్' అని కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఖాతాదారులు తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. దీనిపై స్పందించిన ట్విట్టర్ యాజమాన్యం ట్వీట్లను మింగేస్తున్న ఆ బగ్ ను కనుగొనేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, సీఎన్ బీసీ, ద డెయిలీ మెయిల్, ద ఎల్లెన్ షో, పాప్ సింగర్ లేడీ గాగా ఖాతాలు కూడా ఈ ట్విట్టర్ బగ్ బారినపడ్డాయట.

  • Loading...

More Telugu News