: ప్రాణాంతక వైరస్ మాయం.. బెంబేలెత్తిపోతోన్న శాస్త్రవేత్తలు


అగ్రదేశం అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ల్యాబొరేటరీ నుంచి ఓ ప్రాణాంతక వైరస్ ఉన్న  సీసా మాయమైంది. దీనిని ఉపయోగించి జీవాయుధాలు తయారు చేసే అవకాశం ఉండడంతో అమెరికా శాస్త్రవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది ఒక వేళ ఉగ్రవాదుల చేతికందితే.. జరిగే అనర్థానికి వారు ఖిన్నులై కూర్చున్నారు. 

కాగా, ఈ వైరస్ పేరు `గ్వానారిటో`. దీనిని వెనిజులకు చెందిన గ్వానారిటోలో తొలిసారిగా 1989లో కనుగొన్నారు. ఇది ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎలుకలు మల విసర్జన చేసినప్పుడు ఈ వైరస్ గాలిలో కలుస్తుంది. ఆ గాలిని మనుషులు శ్వాసిస్తే చాలు, ఆ వైరస్ భారిన పడిపోతారు. ఈ వైరస్ సోకిన వారికి హీమోరేజిక్ ఫీవర్ అంటే అంతర్గత రక్తస్రావం జరిగి అవయవాలు విచ్ఛిన్నమైపోతాయి. ఈ వైరస్ సోకిన వాళ్లలో 30 శాతం మంది బ్రతికిబట్టకట్టడం బహుఅరుదని పరిశోధనల్లో తేలింది. 

ఇక, ఈ వైరస్ సీసా కనిపించకుండా పోవడం మీద ప్రస్తుతం శాస్త్రవేత్తలు జుట్టు పీక్కుంటున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ల్యాబ్ లోని ప్రత్యేక గదిలో.. అందులోనూ తాళం వేసి ఉంచిన ఫ్రిజ్ నుంచి ఈ సీసా ఎలా మాయమైపోయిందో అర్థం కాక వారు తల్లడిల్లిపోతున్నారు. 

  • Loading...

More Telugu News