: ఎన్నికల ప్రణాళిక తయారీకి చాలా కసరత్తు చేశాం: సోనియా
2014 ఎన్నికల ప్రణాళిక తయారీకి కొత్త పద్ధతి అవలంబించామని... చాలా కసరత్తు చేశామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారు. ప్రణాళిక తయారీలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ సారి అధికారంలోకి వస్తే మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. లౌకిక భారతం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పేదలు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండగా ఉంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేలు నిజం చెప్పవని... గత రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోతుందని సర్వేలు చెప్పాయని...కానీ, యూపీఏనే అధికారం చేపట్టిందని తెలిపారు.