: పవన్ కల్యాణ్ పై మరోసారి విమర్శలు సంధించిన కవిత
సినీ నటుడు పవన్ కల్యాణ్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, జనసేన పార్టీ ఎన్నికలకు ముందు మేకప్...ఎన్నికలయ్యాక పేకప్ అని ఎద్దేవా చేశారు. పేద ప్రజల గురించి తెలిసిన వారు ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ప్రకటన చేయరని అన్నారు. కొత్త వేషాలు వేసుకుని వచ్చేవారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కవిత హెచ్చరించారు.