: తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందన్న వార్తలను ఖండించిన లతా మంగేష్కర్
తన ఆరోగ్యంపై వచ్చిన వదంతులను గానకోకిల లతా మంగేష్కర్ (84) ఖండించారు. తనకు హార్ట్ ఎటాక్ రాలేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిన్న రాత్రి బాగా పొద్దుపోయాక లతాజీకి గుండెపోటు వచ్చిందన్న పుకార్లు ముంబయిలో హల్ చల్ చేశాయి. అప్పటికే దిగ్గజ నటి నందా కన్నుమూతతో విషాదంలో మునిగిపోయిన బాలీవుడ్ ఈ వార్తలతో ఉలిక్కిపడింది. దీనిపై లతా మంగేష్కర్ ట్విట్టర్లో స్పందించారు. తానేమీ గుండెపోటుకు గురికాలేదని చెప్పారు.