: ప్రజాకాంక్షను ప్రతిబింబించేలా మేనిఫెస్టో: రాహుల్ గాంధీ
ప్రజాకాంక్షను ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపొందించామని... ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించేందుకు ఐదు నెలలు కష్టపడ్డామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 2009 మేనిఫెస్టోలో ప్రతిపాదించిన అన్ని అంశాలను అమలు చేశామని అన్నారు. మేనిఫెస్టోకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలతో సంప్రదించామని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్షల్ని మేనిఫెస్టోలో పొందుపరిచామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను కాళ్ల మీద నిలబడేలా చేసిందని, యువత శక్తి సంపన్నులుగా మారేందుకు తగిన ప్రణాళికలు సిధ్ధం చేశామని రాహుల్ తెలిపారు.