: 2014 ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
2014 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. మేనిఫెస్టోకు ప్రాతిపదికగా భావించే అంశాలతో కూడిన వీడియోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత ఏకే ఆంటోనీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను తయారుచేశామని చెప్పారు. రాహుల్ స్వయంగా ఎంతో మందితో మాట్లాడి, అందరి అభిప్రాయాలు సేకరించి మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆంటోనీ చెప్పారు. ఒక విజన్ తో, మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని ఆయన అన్నారు. కాంగ్రెస్ యువనేతలు, సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎన్నికల ప్రణాళికను రూపొందించామని ఆంటోనీ అన్నారు.