: కెమికల్ ఇంజెక్షన్ తో అమెరికాలో రేపిస్టుకు మరణ దండన


ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అంతమొందించిన క్రూరుడికి అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో మరణదండన అమలు చేశారు. జెఫ్రీ ఫెర్గూసన్(59)కు కెమికల్ ఇంజెక్షన్ ఇవ్వగా 11 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయాడు. 1989లో సెయింట్ లూయిస్ లోని ఓ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న 17 ఏళ్ల బాలికను ఫెర్గూసన్ అపహరించి అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు కోర్టు విచారణలో నిర్ధారణ అయింది. అప్పట్లో 13 రోజుల తర్వాత ఆమె శవం బయటపడింది. దీంతో దోషికి మరణశిక్షను అమలు చేశారు. ఐదు నెలల కాలంలో అమెరికాలోని మిస్సోరీలో అమలు చేసిన ఐదో మరణశిక్ష ఇది. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 13 మంది మరణదండనకు గురయ్యారు.

  • Loading...

More Telugu News