: తిరుమలేశుని దర్శించుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు


ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో పలువురు కాంగ్రెస్ నేతలు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో బస్సు యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అనంతరం తిరుమలేశుని దర్శనార్థం ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్రమంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కొండ్రు మురళి, డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

శ్రీవారి ఆలయం ఎదుట రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసే శక్తిని ప్రసాదించమని శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ, బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News