: పీటల మీద పెళ్లి ఆపేశాడని... పెళ్లికొడుకుని చితకబాదారు
పెళ్లి కొడుకు నిర్వాకంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. దీంతో పెళ్లి కొడుకును పెళ్లి కుమార్తె బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లా హన్మకొండలో పెళ్లి పీటల మీద అమ్మాయి నచ్చలేదని, తాళి కట్టనని వరుడు మొండికేశాడు. దీంతో అమ్మాయి తరపు బంధువులు వరుడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు.