: కేజ్రీవాల్ పాక్ ఏజెంట్: మోడీ
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఓ పాక్ ఏజెంట్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ లోని హీరా నగర్ లో జరుగుతున్న ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్ సైట్లో కాశ్మీర్ ను పాకిస్థాన్ భూభాగంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఏఏపీ నేత కాశ్మీర్ లో రెఫరెండం నిర్వహించాలంటున్నాడని విమర్శించారు. ఆమ్ ఆద్మీ నేతలు పాకిస్థాన్ తరపున మాట్లాడుతున్నట్టున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ దగ్గర మూడు ఏకేలు ఉన్నాయని... వాటిలో మొదటిది ఏకే-47, రెండోది ఏకే ఆంటోనీ (భారత రక్షణ మంత్రి), మూడోది అరవింద్ కేజ్రీవాల్ (ఏకే) అంటూ మండిపడ్డారు.