: మళ్లీ మొదలవుతున్న హెచ్1బి వీసాల జాతర
హెచ్1బి ఉద్యోగ వీసాల కోసం ఏప్రిల్ 1నుంచి అమెరికా దరఖాస్తులు ఆహ్వానించనుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి మొదలు కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు వచ్చేందుకు విదేశీయులు వీటి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత ఐటీ నిపుణులు వీటి కోసం ఎక్కువగా దరఖాస్తు చేసుకోవడం ఏటా చూస్తూనే ఉన్నాం. అమెరికా పౌర, వలస సేవల విభాగం గతేడాది 65వేల హెచ్1బి వీసాలను మంజూరు చేసింది. గతేడాది మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడంతో మొదటి రెండు మూడు రోజుల్లోనే వీసాల కోటా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అక్కడి అధికారులు భావిస్తున్నారు. గతేడాది వలే ఈ ఏడాది కూడా 65వేల వీసాలను అమెరికా ఆఫర్ చేయనుంది.