: ఒవైసీపై వర్మ పోటీ?


పాతబస్తీలో పాగా వేసేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందా?, మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోందా?, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పోటీ చేయనున్నారా?, అంటే జాతీయ మీడియా అవుననే అంటోంది. శివసేన అభ్యర్థిగా రాంగోపాల్ వర్మను ఒవైసీపై పోటీకి నిలబెట్టి, ఎన్డీయే అభ్యర్థిగా చూపేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నిస్తున్నట్టు ముంబై మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

రాంగోపాల్ వర్మ తాజా ప్రవర్తనను కూడా అందుకు ఉదాహరణగా చూపెడుతోంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండే వర్మ, రౌడీ సినిమా ఆవిష్కరణ సందర్భంగా దండలు వేయించుకున్నారు. అందర్నీ విమర్శిస్తాడని పేరున్న వర్మ, మోహన్ బాబును స్నేహితుడంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు తిరుమలలో పుట్టిన రోజు సందర్భంగా సంచలన విషయం చెబుతానని మోహన్ బాబు ప్రకటించారు. మోహన్ బాబు నేడు గుజరాత్ లో మోడీని కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయన వర్మ పోటీని ప్రస్తావించనున్నారని సమాచారం. మొత్తానికి ఊహాగానాలపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

  • Loading...

More Telugu News