: తిరుమలేశుని సర్వదర్శనానికి 16 గంటలు
వరుసగా నాలుగోరోజు కూడా తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అత్యధికంగా 31
కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనంకోసం ఎదురుచూస్తున్నారు. ఇక
తిరుమలేశుని సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. అటు ప్రత్యేక ప్రవేశ
దర్శనానికి 6 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 5 గంటల సమయం
పడుతోంది.