: విదేశీ జెండాలు తెచ్చారంటే ఖబడ్దార్... ప్రేక్షకులకు బీసీబీ వార్నింగ్


తమ దేశ క్రికెట్ అభిమానులకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. టీ-20 ప్రపంచ కప్ మాచ్ లను వీక్షించడానికి వచ్చే బంగ్లాదేశీయులు ఇతర దేశాల జెండాలను పట్టుకుని వస్తే... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన ఆసియా కప్ సందర్భంగా కొందరు బంగ్లా అభిమానులు పాకిస్థాన్ జెండాలు చేతపట్టి హల్ చల్ చేశారు. ఈ వ్యవహారంపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో బీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. 1971లో పాక్ పై జరిగిన యుద్ధానంతరం బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, దేశ జెండా నిబంధనలను అతిక్రమించే బంగ్లా జాతీయులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీబీ తెలిపింది.

  • Loading...

More Telugu News