: కేసీఆర్ ఏమంటున్నాడో వింటున్నారా?: అంబికా కృష్ణ
రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామని చెప్పిన కేసీఆర్ ఏమంటున్నాడో వింటున్నారా? అని టీడీపీ నేత అంబికా కృష్ణ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటామని, సీమాంధ్రులతో ఇంకా లొల్లి ఉందని కేసీఆర్ అంటున్నాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిలవునా చీల్చి ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేపట్టారని ఆయన కాంగ్రెస్ నేతలను నిలదీశారు.
కాంగ్రెస్ గల్లంతైందని, డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేసిన ఆయన, టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య నామమాత్రపు పోటీ ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడి పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని, సీమాంధ్రను అభివృద్ధి చేసే సత్తా బాబుకి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.