: ప్రధాని, సోనియానే మాకు లైన్ క్లియర్ చేశారు: అద్వానీ
యూపీఏ ద్వయం సోనియా, మన్మోహన్ సింగ్ బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి వీలు కల్పించారని ఆ పార్టీ అగ్రనేత అద్వానీ అన్నారు. అందుకే ఈ విషయంలో మనం యూపీయేకు రుణపడి ఉన్నామంటూ సహచరులకు చెబుతుంటానన్నారు. వారిద్దరూ ఒక క్రమపద్ధతిలో పనిచేసి రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా మార్గాన్ని సుగమం చేశారని తన బ్లాగులో అద్వానీ రాశారు. కానీ, మోడీ గురించి మాత్రం అద్వానీ ప్రస్తావించలేదు.