: చైనాలో ఇకపై స్వచ్ఛమైన 'గాలి'ని కొనుక్కోవాలి
అభివృద్ధి కోసం పర్యావరణ విధ్వంసానికి పాల్పడితే కలిగే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చైనీయులకు కళ్లకు కడుతున్నాయి. స్వచ్ఛమైన గాలికి కూడా నోచుకోని దారుణ స్థితి నేడు చైనా వాసులది. అక్కడ స్వచ్ఛమైన నీరే కాదు, స్వచ్ఛమైన గాలి కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చేసింది. చైనాలోని చాలా ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరింది. దీంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ బాటిళ్లను ముందుగా పర్యాటకులకు విక్రయించేందుకు చైనా ప్రభుత్వం అనుమతించింది. ఫాన్ జింగ్, లీగాంగ్ పర్వత ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉంది. ఆ గాలిని సేకరించి బాటిళ్లలో నింపి జూన్ 20 నుంచి విక్రయించనున్నారు. ముందుగా కాలుష్యం ఎక్కువగా ఉన్న గుజౌ ప్రావిన్స్ లో వీటిని విక్రయిస్తారు. నీరు, గాలి, ఆహారం అన్నీ కొనుక్కోవాల్సిన స్థితి... చైనా ప్రగతికి రెండోవైపున్న కోణం ఇది.