: టీడీపీలో చేరిన ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలోకి నేతలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా ధరించారు. ఈయన మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, మరోనేత సతీష్ మాదిగ కూడా సైకిలెక్కారు! మహబూబ్ నగర్ లో జరిగిన టీడీపీ ప్రజాగర్జన సభ సందర్భంగా వీరు పార్టీలో చేరారు.