: కూకట్ పల్లి నుంచి సూరీడు పోటీ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావు మరోసారి తెరవెనుక చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడుకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించేందుకు కేవీపీ పావులు కదుపుతున్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సూరీడును బరిలో దింపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది.