: బీజేపీనీ వీడనంటున్న జశ్వంత్ సింగ్


బీజేపీ తిరుగుబాటు నేత జశ్వంత్ సింగ్ తాను పార్టీని వీడేది లేదంటున్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పథకం ప్రకారం తనను పక్కనబెట్టారని ఆరోపించారు. సొంత నియోజకవర్గం బార్మార్ (రాజస్థాన్) లో తనకు టికెట్ నిరాకరించి అవమానించారని, ఇది నమ్మకద్రోహమని వ్యాఖ్యానించారు. అయినా, పార్టీని వదిలి వెళ్ళడానికి మనసు అంగీకరించడంలేదని చెప్పారు. ఈ విషయంలో పార్టీయే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

పార్టీ తనకు మొండిచేయి చూపడం ఇది రెండోసారని, అయితే, దేవుడిపై నమ్మకంతో ముందుకుసాగుతున్నానని జశ్వంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో 'వ్యక్తి పూజ'కు ప్రాధాన్యత ఇస్తున్నారని పరోక్షంగా మోడీనుద్దేశించి ఆరోపణ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని, పార్టీకి హాని చేస్తుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News