: లంక తమిళులకు మద్దతుగా అజిత్ షూటింగ్ వాయిదా
శ్రీలంక తమిళుల సమస్యపై తమిళ హీరో అజిత్ స్పందించారు. లంకలో తమిళులపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా అజిత్ తన నూతన చిత్రం షూటింగ్ ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 2న లంక తమిళులకు సంఘీభావం ప్రకటిస్తూ, తమిళనాడులో నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. ఈ దీక్షలో పాల్గొనేందుకు అజిత్ షూటింగ్ వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. నిర్మాతల అనుమతితోనే చిత్రీకరణ నిలిపివేసినట్టు ఆయన వెల్లడించారు.