: బొత్స మా పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారు: కిషన్ రెడ్డి
మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తమ నేతలతో టచ్ లో ఉన్నారని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బొత్స తమ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని, మోహన్ బాబు బీజేపీలోకి రాకుండా ఆగిపోయారని అన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందని తామెప్పుడూ చెప్పలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇరు ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీ బలాబలాలేంటో తమకు తెలుసని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాలు గెలిచామని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.