: మహబూబ్ నగర్ లో టీడీపీ ప్రజాగర్జన ర్యాలీ ప్రారంభం
మహబూబ్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో ఆ పార్టీ బీసీ నేత ఆర్. కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. కొద్దిసేపట్లో సభ వద్దకు పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలతో చేరుకోనున్నారు. తెలంగాణలో బీసీ వ్యక్తినే తమ పార్టీనుంచి ముఖ్యమంత్రి చేస్తామంటూ టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో, మరింత ఉత్సాహంతో కృష్ణయ్య ఉన్నారు. తెలంగాణలో కనుక టీడీపీ అధికారంలోకి వస్తే కృష్ణయ్యనే సీఎంగా చేస్తారని కొద్ది రోజుల నుంచీ ప్రచారం జరుగుతోంది.